అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి
Sailaja Reddy Alluddu

అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి

14-11-2017

అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి

ఆడపిల్లల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రముఖ సినీ కథానాయిక రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌ నుంచి రవీంద్రభారతి వరకు నిర్వహించిన సైకిల్‌ ర్యాలీని రకుల్‌తో పాటు ఆ శాఖ డైరెక్టర్‌ విజయోద్రీ ప్రారంభించారు.ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ లింగ నిర్ధారణ ద్వారా బ్రూణ హత్యలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. లింగ నిర్ధారణకు సహకరించే వారినీ కఠినంగా శిక్షించాలని కోరారు. అమ్మాయి, అబ్బాయి సమానమేనని, ఇద్దరికీ సమాన స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. మహిళల అక్రమ రవాణా నివారించడంతో పాటు బాల్య వివాహాలను నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కట్నం తీసుకునే వారిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.