నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి... రక్షణ కల్పించాలి
Sailaja Reddy Alluddu

నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి... రక్షణ కల్పించాలి

14-11-2017

నాకు  బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి... రక్షణ కల్పించాలి

నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి రక్షణ కల్పించాలని కోరుతూ లక్ష్మీస్‌ వీరగ్రంథం సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల డీజీపీలను కోరారు. లక్ష్మీస్‌ వీరగ్రంథం సినిమా షూటింగ్‌ ను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద రెండు రోజుల క్రితం ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి వైఖరిని ఎండగడతానని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా ఈ సినిమాను ప్రకటించిన నాటినుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, రక్షణ కల్పించాలని కోరుతూ ఇరు రాష్ట్రాల డీజీపీలను ఆయన కోరారు.