మోదీ టెంట్‌లో విద్యాబాలన్‌

మోదీ టెంట్‌లో విద్యాబాలన్‌

10-11-2017

మోదీ టెంట్‌లో విద్యాబాలన్‌

మోదీ టెంట్‌లో హాట్‌ బాంబ్‌ విద్యాబాలన్‌ ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా. మరేం లేదండి ఈ బాలీవుడ్‌ భామ సురేష్‌ త్రివేణి దర్శకత్వంలో తుమర్హీ సులు అనే చిత్రం చేసింది. ఈ మూవీ నవంబర్‌ 17న విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్‌ కోసం రీసెంట్‌గా గుజరాత్‌ వెళ్లింది. ఈ సందర్భంగా గుజరాత్‌ పర్యాటక శాఖ ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ టెంట్‌ ని కేటాయించారు. ఇందులో సోఫా, టీవీ, మల్టీమీడియా ప్లేయర్లు, రెండు బెడ్‌ రూంలు ఉన్నాయి. వాస్తవానికి ఈ టెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే కేటాయిస్తారట. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉందని, రాజభోగాలు అనుభవిస్తున్నట్లు ఉందని విద్యా తెలిపింది. విద్యా ప్రస్తుతం తన సినిమాని ఓ రేంజ్‌లో ప్రమోట్‌ చేసుకొనే పనిలో పడింది. ఇటీవల సల్మాన్‌ బిగ్‌ బాస్‌ షోకి కూడా వెళ్లి అక్కడ సినిమాకి సంబంధించిన విషయాలు షేర్‌ చేసుకుంది.