ఈ నెల 24న నమిత పెళ్లి

ఈ నెల 24న నమిత పెళ్లి

10-11-2017

ఈ నెల 24న నమిత పెళ్లి

తన అందచందాలతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులని కట్టిపడేసిన బొద్దుగుమ్మ నమిత. ఒకప్పుడు నమితకు తమిళంలో స్టార్‌ హీరోస్‌ కి ఉన్న క్రేజ్‌ ఉండేది. ఈమె సినిమాల కోసం అభిమానులు థియేటర్ల దగ్గర బారులు కట్టేవారు. కొందరు తన అభిమానం చాటుకోవడానికి గుళ్ళు కూడా కట్టారు. తెలుగులోను సత్తా చాటిన నమిత చివరిగా 2010లో విడుదలైన సింహలో నటించింది. ఆ తర్వాత నమిత మరే తెలుగు సినిమాకు సైన్‌ చేయలేదు.

అయితే ఇప్పుడు నమిత పెళ్లి హాట్‌ టాపిక్‌ గా మారింది. సొంతం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ సీనియర్‌ నటుడు శరత్‌ బాబుని వివాహం చేసుకోనుందని పలు వార్తలు రాగా, వీటిని శరత్‌ బాబు, నమిత ఖండించారు. కాని ఇప్పుడు నమిత, తన వివాహం వీరాతో ఈ నెల 24న జరగనుందని అఫీషియల్‌గా ప్రకటించింది. తమిళ బిగ్‌ బాస్‌ ప్రోగ్రాం కంటెస్టెంట్లు రజియా విల్సన్‌ మరికొందరు కలిసి సోషల్‌ మీడియాలో ఓ సూపర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నామంటూ ఓ వీడియా ద్వారా నమిత పెళ్ళి విషయాన్ని తెలిపారు. ఇక వీర కూడా తన అఫీషియల్‌ పేజ్‌లో నమితని వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపాడు. వీరా, నమిత కలిసి మియా అనే థ్రిల్లర్‌ ఫిలింలో కలిసి నటించారు.