కోహ్లీ అంటే నాకేకాదు... ఎవరికైనా ఇష్టమే

కోహ్లీ అంటే నాకేకాదు... ఎవరికైనా ఇష్టమే

10-11-2017

కోహ్లీ అంటే నాకేకాదు... ఎవరికైనా ఇష్టమే

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని అంటోంది బాలీవుడ్‌ నటి జైరా వాసిం. బెంగళూరులో డిసెంబర్‌లో మిడ్‌నైట్‌ మారథాన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జైరాను ప్రచారకర్తగా నియమించారు. ఈ సందర్భంగా జైరా తనకు నచ్చిన క్రీడాకారుల గురించి చెప్పుకొచ్చింది. తనకు బాక్సింగ్‌ ఛాంపియన్‌ మేరీ కోం అంటే చాలా ఇష్టమని తెలిపింది. మేరీ కోం బయోపిక్‌లో రీల్‌ లైఫ్‌గా మేరీగా ప్రియాంక చోప్రా నటించింది. ఒకవేళ మరో బయోపిక్‌ తీస్తే అందులో రీల్‌ లైఫ్‌ మేరీగా నటించాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

క్రికెట్‌ రంగంలో టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన ఫేవరేట్‌ అని చెప్పింది. విరాట్‌ అంటే తనకే కాదు అందరికీ ఇష్టమేనని పేర్కొంది. అనంతరం తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ నేను నా భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోను. నా తలరాతనే నమ్ముతాను. మనం ప్లాన్‌ చేసుకున్నది కాకుండా మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని గత మూడేళ్లలో తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది జైరా. జైరా వాసిం, అమిర్‌ ఖాన్‌, ప్రధాన పాత్రల్లో నటించిన సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది.