బాహుబలి-2 మరో అరుదైన గౌరవం

బాహుబలి-2 మరో అరుదైన గౌరవం

10-11-2017

బాహుబలి-2 మరో అరుదైన గౌరవం

గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 48వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించనున్న సినిమాల జాబితా వెల్లడయింది. ప్రధాన స్రవంతి చిత్రాల విభాగంలో బాహుబలి-2, ఇండియన్‌ పనోరమా విభాగంలో జాతీయ అవార్డు పొందిన మరాఠీ చిత్రం కాసవ్‌ ఎంపికయ్యాయి. ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో అక్షయ్‌ కుమార్‌ నటించిన జోలీ ఎల్‌ఎల్‌బీ, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో చంద్రశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఫైర్‌ ఫైల్స్‌ ఇన్‌ ద అబియస్‌ ఎంపికయ్యారు. ఫీచర్‌ విభాగంలో 26, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగానికి 16 సినిమాలు ప్రదర్శిస్తారు. ఫీచర్‌ ఫిల్మ్‌లకు ప్రముఖ దర్శకుడు సుజొయ్‌ ఘోష్‌, నాన్‌ఫీచర్‌ ఫిల్మ్‌లకు సుధీర్‌ మిశ్రలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. వినోద్‌ కాప్రి నిర్మించిన హిందీ సినిమా పిహు, కమల్‌ స్వరూప్‌ దర్శకత్వం వహించిన పుష్కర్‌ పురాణ్‌లను తొలి చిత్రాలుగా ప్రదర్శిస్తారు.