విజువల్ వండర్ గా సువర్ణసుందరి టీజర్
Ramakrishna

విజువల్ వండర్ గా సువర్ణసుందరి టీజర్

09-11-2017

విజువల్ వండర్ గా సువర్ణసుందరి టీజర్

చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది.. ఇది సువర్ణ సుందరి చిత్ర ట్యాగ్ లైన్. ఈ లైన్ కి తగ్గట్టుగానే ఉంది సువర్ణ సుందరి చిత్ర టీజర్.విజువల్ వండర్ గా చూడగానే  హాంట్ చెస్తొంది  సువర్ణ సుందరి టీజర్. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లొ ఎమ్.ఎల్.లక్ష్మి ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకుడు. సువర్ణ సుందరి టీజర్ ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చెసింది. రిలీజైన కొద్ది సమయంలొనె సొషల్ మీడియా లొ వైరల్ గా మారింది ఈ సువర్ణ సుందరి.  హిస్టారికల్ అడ్వెంచర్ గా తెరకెక్కతొన్న ఈ చిత్రం ఏ రెంజ్ లో ఉండబొతొందనటానికి ఈ టీజర్ పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ గా నిలిచింది. దర్శకుడు సూర్య టేకింగ్ తో పాటు, ఎలు మహంతి విజువల్స్, సాయి కార్తీక్ స్టన్నింగ్ ఆర్.ఆర్ టీజర్ లో హైలెట్ గా చెప్పుకొవచ్చు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపొని విధంగా, ఏ విధమైన బిజినెస్ క్యాలుక్యులేషన్స్ లేకుండా గ్రాండ్ లుక్ తో టెక్నికల్లీ ఓ బ్రిలియంట్  మూవీ గా రూపొందుతొన్న సువర్ణ సుందరి అతి త్వరలొనె ఆడియో విడుదల చెసుకొనుంది.ఇక డిసెంబర్ లొనె  సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి.