చిన్నతనం నుంచి అతనంటే పిచ్చి....ప్రేమలో పడిపోయా

చిన్నతనం నుంచి అతనంటే పిచ్చి....ప్రేమలో పడిపోయా

09-11-2017

చిన్నతనం నుంచి అతనంటే పిచ్చి....ప్రేమలో పడిపోయా

 దక్షిణాదిన భారీ బడ్జెట్‌ సినిమా అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు అనుష్కదే. దక్షిణాదిన లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల ట్రెండ్‌ను తిరిగి ప్రారంభించింది కూడా జేజమ్మే. దీంతో హీరోలతో సమానంగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకుంది. అలాంటి అనుష్కకు ఓ క్రికెటర్‌ అంటే చాలా అభిమానమట. ఓ వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తనకు ఇష్టమైన క్రికెటర్‌ గురించి మాట్లాడింది. ఎంతోమందికి ఆరాధ్య నటి అయిన అనుష్క ఓ క్రికెటర్‌కు వీరాభిమానట. ఒకానొక సమయంలో అతనితో పీకల్లోతు ప్రేమలో పడిపోయిందట. ఇంతకీ ఈ క్రికెటర్‌ ఎవరో తెలుసా? మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌. నేను ద్రవిడ్‌కు వీరాభిమానిని. అతనంటే చిన్నప్పట్నుంచీ నాకు పిచ్చి. ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయానని అనుష్క చెప్పింది.