వాళ్ల మధ్య రొమాన్స్‌ లేదు

వాళ్ల మధ్య రొమాన్స్‌ లేదు

09-11-2017

వాళ్ల మధ్య రొమాన్స్‌ లేదు

పద్మావతి మూవీపై రోజురోజుకూ వివాదం ముదురుతుండటంతో ఆ మూవీ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ క్లారిట్‌ ఇచ్చాడు. సినిమాలో అందరూ అనుకుంటున్నట్లు అల్లావుద్దీన్‌ ఖిల్జీ, రాణి పద్మిణి మధ్య ఎలాంటి రొమాన్స్‌ లేదని అతను సృష్టం చేశారు. ఇవాళ యూట్యూబ్‌లో ఓ వీడియో సందేశాన్ని భన్సాలీ పోస్ట్‌ చేశారు. రాజ్‌పుత్‌లను అవమానించేలా, తక్కువ చేసి చూపించేలా ఎలాంటి సీన్లు సినిమాలో లేవని చెప్పాడు. రాణి పద్మిణి సాహసాన్ని, ఆమె బలిదానాన్ని ఉన్నతంగా చూపించామని, దయచేసి సినిమాను అడ్డుకోవద్దని కోరాడు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా బాధ్యతగా సినిమాను తీశామని భన్సాలీ తెలిపాడు. అసలు సినిమాలో రణ్‌వీర్‌, దీపీకా ఎక్కడా కలుసుకోరని, వాళ్లిద్దరితో కలిసి ఒక్కరోజు కూడా షూటింగ్‌ చేయలేదని అతను సృష్టం చేశారు.

ఈ మధ్యే  సినిమాలో ఖిల్జీగా నటించిన రణ్‌వీర్‌ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అసలు మూవీలో దీపికాతో కలిసి చేసిన ఒక్క సీన్‌ కూడా లేదని రణ్‌వీర్‌ చెప్పాడు. ఈ మూవీపై చాలా కాలంగా రాజ్‌పుత్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్‌ 1న మూవీ విడుదల కావాల్సి ఉండటంతో మొత్తానికి డైరెక్టర్‌ భన్సాలీ మూవీపై వివరణ ఇచ్చి రాజ్‌పుత్‌లను శాంతింపజేసే ప్రయత్నం చేశాడు.