పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి

08-11-2017

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి

భరత్ ఆర్ట్ ప్రొడక్షన్స్..  ప్రొడక్షన్ నెంబర్ వన్ గా బండారు దానయ్య కవి దర్శకత్వంలో కదిరి శేఖర్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి'. జూబ్లీహిల్స్ లో వున్న సంస్థ కార్యాలయంలో హీరో శరత్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు బండారు దానయ్య కవి చిత్ర విశేషాలను తెలిపారు. 

ఆయన మాట్లాడుతూ.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతున్నాయి. మంచి కథ, కధనాలు కుదిరాయి. ఒక అగ్ర హీరో చేతుల మీదుగా అతి త్వరలో ఆడియోను విడుదల చేస్తాము. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఇదే బ్యానర్ లో  ప్రొడక్షన్ నెం 2 గా తెరకెక్కబోయే చిత్రానికి విజయదశమి రోజు పూజ కార్యక్రమాలు కూడా జరిపాము. 'ఓ కంట్లో భయం, ఓ కంట్లో జయం' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కధానాయకుడు శరత్ కళ్యాణ్ తో పాటు కొత్త మరియు పాత తారాగణం నటిస్తారు...అని తెలిపారు. 

ఈ రెండు చిత్రాలకు కథ, స్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం: బండారు దానయ్య కవి.