ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ విడుదల చేసిన ఇ ఈ... సినిమా పాటలు
Ramakrishna

ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ విడుదల చేసిన ఇ ఈ... సినిమా పాటలు

08-11-2017

ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ విడుదల చేసిన ఇ ఈ... సినిమా పాటలు

నీరజ్‌ శ్యామ్‌, నైరా షా జంటగా నటించిన చిత్రం ‘ఇ ఈ’. ఈ చిత్రంలోని అమ్మా, నీతోనే నేను అనే పాటలను మ్యూజిక్ సంచలనం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ విడుదల చేయడం విశేషం. చెన్నైలో రెహమాన్ చిత్ర యూనిట్ తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇ ఈ చిత్రంలోని అమ్మా అనే పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. కృష్ణ చైతన్య మంచి టాలెంటెడ్.. హార్డ్ వర్కింగ్ మ్యూజిషియన్. అతనికి మంచి భవిష్యత్ ఉంది. చిత్ర యూనిట్ కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అని అన్నారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్‌ గణపతిరావు మాట్లాడుతూ... మాకు బిగ్ డే ఈరోజు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, భారతీయులు సగర్వంగా తలెత్తుకునేలా చేసిన సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ గారు మా ఇ ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేయడం నిజంగా మా అదృష్టం. ఆయనకు ఈ సందర్భంగా మా చిత్ర యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రేమ కథా చిత్రాల్లో సరికొత్త పంథాలో మా ఇ ఈ చిత్రం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. నా స్నేహితుడు దర్శకుడు మారుతి ఇటీవలే రిలీజే చేసిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. అని అన్నారు. 

 నీరజ్ శ్యామ్, నైరా షా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు సుధాకర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. నవబాల క్రియేషన్స్‌ పతాకంపై లక్ష్మణ్‌రావు ‘ఇ ఈ’చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చేతన్‌ టీఆర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 

Click here for Event Gallery