సంగీత విభావరిలో ఇళయరాజా

సంగీత విభావరిలో ఇళయరాజా

06-11-2017

సంగీత విభావరిలో ఇళయరాజా

మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి భాగ్యనగరవాసులను మైమరిపించింది. మధురానుభూతులను అందించింది. గురువందనతో మాస్ట్రో ఇళయరాజ సంగీత విభావరి ప్రారంభమైంది. జగదానందకార (శ్రీరామరాజ్యంలోని) పాటతో విభావరికి శ్రీకారం చుట్టారు. కార్తిక సంధ్యవేళ సంగీత సమారాధన ఆరంభించారు. నిత్య ఘర్షణతో అలసిన ప్రేక్షకులకు తియ్యని చిత్ర గానం సిరిమల్లెల వాన కురిపించింది. సింగర్‌ కార్తీక్‌ కీరవాణి అంటూ మధురసవాణి పలికించాడు. ఇంతలో బలపంపట్టి భామ ఒళ్లో అంటూ మనో, చిత్ర ప్రేక్షకులను గమ్మత్తులో ముంచారు. ఇక మాటే మంత్రం, మనసే బంధమూ అంటూ మాస్ట్రో ఇళయరాజా సంయోగల సంగీతాల ఝురిలో వోలాలడించారు. ఈ విభావరికి హాజరైన వారిలో ఎక్కువమది పాతికేళ్లలోపు వారే. అయినా కాలానికి అందని, తరాలకు లొంగని సంగీతంలో 3 గంటలపాటు లయరాజ మ్యూజిక్‌ చేశారు. సంధ్యారాగపు సరిగమలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.