తెలుగువారంతా కలిసిమెలసి ఉండాలి

తెలుగువారంతా కలిసిమెలసి ఉండాలి

06-11-2017

తెలుగువారంతా కలిసిమెలసి ఉండాలి

తెలుగు వారిలో సమష్టితత్వం ఉండాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమణ ఆకాంక్షించారు. దేశ రాజధానిలో ఢిల్లీ తెలుగు అకాడమీ 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్‌ రమణ మాట్లాడుతూ తెలుగేతర ప్రాంతాల్లో నివసించే తెలుగు వారు కలిసిమెలసి ఉండాలన్నారు. దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల వారితో పోలిస్తే తెలుగువారిలో భాషాభిమానం లోపించిందేమోన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో నగరంలోని తెలుగువారి సంఖ్యరతో పొల్చిచూస్తే ఈ సమావేశానికి హాజరైన తెలుగువారు తక్కువ. ఢిల్లీలో అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు, వారి భాషా, సంస్కృతి సంఘాలున్నాయి. దక్షిణ భారతదేశం నుంచి తమిళ, కన్నడ మలయాళ సంఘాలవారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటుచేస్తే ఆయా రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వారి భాష, రాష్ట్రం సంస్కృతులపట్ల గౌరవాన్ని చాటుతుంటారు. దురదృష్టవశాత్తు తెలుగువారలో అది లోపించిందేమోన్న అభిప్రాయం కలుగుతోంది. ఇకముందు జరగబోయే సమావేశాలకు మరింత ఎక్కువ మంది హాజరై తెలుగువారి గొప్పతనాన్ని, సంస్కృతి ఔన్నత్యాన్ని, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. 

అనంతరం హాస్యనటుడు బ్రహ్మానందానికి జీవిత సాఫల్యం పురస్కాం, సామాజిక సేవలో గురుప్రసాద్‌, విద్యా రంగంలో సాయికుమార్‌, వైద్య రంగంలో దశరథరామిరెడ్డి, ఆర్థిక రంగలో మహేశ్‌ వై రెడ్డిలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్‌, నటులు తనికెళ్ల భరణి, అలీ, రవిబాబు, అసోం గవర్నర్‌ జగదీశ్‌ముఖి పాల్గొన్నారు.