'నగరం' మూవీ సక్సెస్ మీట్

'నగరం' మూవీ సక్సెస్ మీట్

12-03-2017

'నగరం' మూవీ సక్సెస్ మీట్

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా, రెజీనా కథానాయికగా అశ్వనికుమార్‌ సహదేవ్‌ సమర్పణలో ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ పతాకాలపై లోకేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నగరం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర‌యూనిట్ ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో ...

చిత్ర ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ మాట్లాడుతూ - ``సినిమా మంచి స‌క్సెస్ సాధిస్తుంద‌ని తెలుసు కానీ..ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఉహించ‌లేదు. నేను ఈ సినిమా చేయ‌క ముందు కొన్ని షార్ట్ ఫిలింస్, ఓ ఇండిపెండెంట్ మూవీ చేశాను. సినిమాపై ఫ్యాష‌న్‌తో ఈ రంగంలోకి అడుగు పెట్టాను. ఈ సినిమా స‌క్సెస్ ద‌ర్శ‌కుడిగా నా బాధ్య‌త‌ను ఇంకా పెంచింది`` అన్నారు.

హీరో శ్రీ మాట్లాడుతూ - ``న‌గ‌రం సినిమాను ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈరోజు నుండి ఇంకా థియేట‌ర్స్ పెరుగుతున్నాయి. సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది`` అన్నారు.

సందీప్‌కిష‌న్ మాట్లాడుతూ - ``న‌క్ష‌త్రం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల సినిమా ప్ర‌మోష‌న్స్‌లో స‌రిగ్గా పాల్గొన‌లేక‌పోయాను. నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్ర‌భుగారికి, తెలుగు నిర్మాత అశ్వినికుమార్‌గారికి థాంక్స్‌. రెండు సంత్స‌రాలు పాటు టీం అంతా రాత్రి ప‌గ‌లు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. హీరో శ్రీ కూడా సినిమాలో అద్భుతంగా న‌టించాడు. సినిమాను ముందు త‌మిళంలో కొందరు క్రిటిక్స్ చూసి, అద్భుతంగా ఉంద‌ని అప్రిసియేట్ చేస్తూ వెబ్‌సైట్స్‌లో రాశారు. ఆ అప్రిసియేష‌న్ చూసి నేను ఇర‌వై నిమిషాల పాటు ఏడ్చేశాను. ఎందుకంటే నాకు ఒక మంచి హిట్ చిత్రం వ‌చ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది. ఇలాంటి ఓ మంచి సినిమాతో నా బాధ‌నంతా తీర్చేసిన ద‌ర్శ‌కుడు లోకేష్‌కు థాంక్స్‌. నెటివిటీకి సంబంధం లేకుండా సినిమాను విజ‌య‌వంతం చేస్తార‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి నిరూపించారు`` అన్నారు.