అడివి శేష్ "గూడచారి" టైటిల్ లోగో మరియు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
Sailaja Reddy Alluddu

అడివి శేష్ "గూడచారి" టైటిల్ లోగో మరియు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

04-11-2017

అడివి శేష్

"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం "గూడచారి". అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న "గూడచారి" చిత్రం ద్వారా శశికిరణ్ తిక్క అనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అడివి శేష్ సరసన మిస్ ఇండియా అయిన మన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అడివి శేష్ కథ సమకూర్చడం విశేషం. 

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "వైవిధ్యమైన "గూడచారి" టైటిల్ లోగో & కాన్సెప్ట్ పోస్టర్ ను నేడు విడుదల చేస్తున్నాం. అడివి శేష్ ఈ చిత్రంలో "గూడచారి" పాత్ర పోషిస్తున్నాడు, హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. తెలుగులో ఈ చిత్రం సరికొత్త స్టాండర్డ్స్ ను సెట్ చేయడం ఖాయం. ఇక ఈ చిత్రంలో కథానాయికగా మిస్ ఇండియా మాత్రమే కాక తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ నటిస్తుండడం విశేషం. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలకానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిసెంబర్ 17న విడుదలచేయనున్నాం" అన్నారు. 

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: శివంరావ్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: షానిల్ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ-నిర్మాత: వివేక్ కూచిబోట్ల, కథ: అడివి శేష్, నిర్మాతలు: అభిషేక్ నామా-టిజి.విశ్వప్రసాద్-అభిషేక్ అగర్వాల్, దర్శకత్వం: శశికిరణ్ తిక్క.