వరుణ్‌ ధావణ్‌కు అరుదైన గౌరవం

వరుణ్‌ ధావణ్‌కు అరుదైన గౌరవం

17-10-2017

వరుణ్‌ ధావణ్‌కు అరుదైన గౌరవం

బాలీవుడ్‌ యువ కథానాయకుడు వరుణ్‌ ధావణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. హాంకాంగ్‌లోని మేడం టుస్సాడ్స్‌లో వరుణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. గతంలో మహాత్మాగాంధీ, ప్రధాని మోడీ, అమితాబ్‌ బచ్చన్‌ల మైనపు విగ్రహాలను ఈ మ్యూజియంలో నెలకొల్పారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో వరుణ్‌ తన విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మేడం టుస్సాడ్స్‌ మ్యూజియం సిబ్బంది వరుణ్‌ కొలతలను తీసుకున్నారు. చాలా గొప్ప గౌరవం. హాంకాంగ్‌కి వెళ్ళి నా మైనపు విగ్రహాన్ని చూడాలని చాలా ఆతృతంగా ఉంది అంటూ తన ఆనందాన్ని వరుణ్‌ ట్వీట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.