‘రాజా ది గ్రేట్‌’ ట్రైలర్‌ విడుదల
MarinaSkies
Kizen

‘రాజా ది గ్రేట్‌’ ట్రైలర్‌ విడుదల

06-10-2017

‘రాజా ది గ్రేట్‌’ ట్రైలర్‌ విడుదల

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ తొలిసారిగా ఓ అంధుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. ఈ సినిమా ట్రైలర్ ను కొంచెం సేపటి క్రితం రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. ఈ విషయాన్ని పేర్కొన్న రవితేజ, ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. రవితేజకు జోడిగా మెహ్రిన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రవితేజ తల్లి పాత్రను సీనియర్ నటి రాధిక పోషించారు.

‘లైఫ్ ఏదీ ఎదురొచ్చి మనకివ్వదు... బాధ నుంచి సంతోషమైనా, ఓటమి నుంచి గెలుపైనా’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్, ‘నేను పూరీలు వేసుకోవడం లేదురా, ఉరేసుకుంటున్నాను!’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అనడం, ‘చివరగా వచ్చే ఆర్తనాదం వినాలని ఉంది’ అంటూ రవితేజ బదులివ్వడం ఆసక్తికరంగా ఉన్నాయి.