మైటీ స్టార్ శ్రీకాంత్ వైవిధ్యమైన పాత్రలో కొత్త చిత్రం....
MarinaSkies
Kizen

మైటీ స్టార్ శ్రీకాంత్ వైవిధ్యమైన పాత్రలో కొత్త చిత్రం....

05-10-2017

మైటీ స్టార్ శ్రీకాంత్ వైవిధ్యమైన పాత్రలో కొత్త చిత్రం....

మైటీ స్టార్ శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ఏవీఎల్ ప్రొడక్షన్స్ సంస్థ కొత్త చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రంతో అభయ్ కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వైద్య రంగం నేపథ్యంలోని అంశాలతో మెడికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. జై రాజా సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ చిత్రంలో భాగమవడం గురించి కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ....కథ నన్ను బాగా ఆకట్టుకుంది. సబ్జెక్ట్ వినగానే నచ్చి వెంటనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. చిత్రంలో నాది ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్. ఇలాంటి మంచి కథలో కీ రోల్ చేస్తుండటం సంతోషంగా ఉంది. జై రాజా సింగ్ కొత్త దర్శకుడు అయినా భిన్నమైన కథను ప్రతిభావంతంగా రాసుకున్నారు. అన్నారు.

దర్శకుడు జై రాజా సింగ్ మాట్లాడుతూ...ఎప్పుడూ మంచి పాత్రలు, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలని శ్రీకాంత్ గారు ఆరాటపడుతుంటారు. ఆయనలో గొప్ప నటుడు ఉన్నారు. కథ రాసుకుంటున్నప్పుడే ఈ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు చేయాలని అనుకున్నాను. ఆయన మా సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా తెరపై చూపించని విధంగా కొత్త తరహాలో ఆయన పాత్ర ఉంటుంది. మెడికల్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందించబోతున్నాం. మంచి కాస్ట్ అండ్ క్రూ తో త్వరలో సెట్స్ మీదకు చిత్రాన్ని తీసుకెళ్తాం. అన్నారు.