అమెరికాలో బ్రహ్మానందంకి అరుదైన గౌరవం
MarinaSkies
Kizen

అమెరికాలో బ్రహ్మానందంకి అరుదైన గౌరవం

04-10-2017

అమెరికాలో బ్రహ్మానందంకి అరుదైన గౌరవం

అమెరికాలోని సియాటెల్‌ నగరంలో ఈ నెల 6న జరిగే తస్వీర్‌ 12వ సౌత్‌ ఏషియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బ్రహ్మానందం గౌరవ అతిధిగా రెడ్‌ కార్పెట్‌ స్వాగతం అందుకోనున్నారు. అదే వేదికపై ఏడో తేదీన యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ సౌత్‌ ఏషియా సెంటర్‌ ఆయన్ని ఘనంగా సన్మానించనుంది. ఇప్పటి వరకు జకర్తాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నర్తనశాల (1964) చిత్రానికి గాను ఎస్వీరంగారావుకు ఇలాంటి గౌరవం దక్కింది. ఇలాంటి సన్మానం అందుకుంటున్న బ్రహ్మానందం రెండో నటుడు. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్‌ కోసం అమెరికాలోనే ఉన్నారు బ్రహ్మానందం.