ఒకే ఒక్క పిలుపుతో రెచ్చి పోయిన రెబల్ ఫాన్స్
MarinaSkies
Kizen

ఒకే ఒక్క పిలుపుతో రెచ్చి పోయిన రెబల్ ఫాన్స్

03-10-2017

ఒకే ఒక్క పిలుపుతో రెచ్చి పోయిన రెబల్ ఫాన్స్

ఓకే ఒక్క పిలుపుతో ఉద్యమ స్థాయిలో  ఉరకలెత్తి  ఉభయ రాష్ట్రాలలో  స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా అభిమానులందరికి నా తరఫున, మా ప్రభాస్ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు రెబెల్ స్టార్ కృష్ణంరాజు. అక్టోబర్2, గాంధీ జయంతి సందర్భంగా ఉభయ రాష్ట్రాలలోని తమ అభిమానులకు స్వచ్ఛ భారత్  కార్యక్రమాలు నిర్వహించండి అంటూ రెబెల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ట్విట్టర్ ,ఫేస్ బుక్ లలో చేసిన ఒకే ఒక్క పోస్టింగ్ కు ఉద్యమ స్థాయిలో స్పందించి అన్ని ప్రధాన నగరాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించారు రెబెల్ ఫాన్స్.ఈ సందర్భంగా తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ"మా పిలుపుకు స్పందించి తమ స్వచ్చమైన మనసుతో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా అభిమానులు అందరికి కృతజ్ఞతలు. స్వచ్చ భారత్ అనేది ఒక నిరంతర ప్రక్రియ.అది మన దైనందిన జీవితంలో ఒక భాగం వంటిది.

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమానికి పునరంకితమవ్వడమే కాకుండా ఏడాది పొడుగునా మా అభిమానులు ఇందులో నిరంతర భాగస్వాములు అవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ భారత్ ను విజయవంతం చేయడం మన అందరి కర్తవ్యం.తన స్వచ్ఛమైన మనసుతో దేశమంతా స్వచ్చంగా ఉండాలన్న లక్ష్యంతో మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ఆశయానికి అనుగుణంగా నేను ,ప్రభాస్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు"అన్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ స్పందిస్తూ"స్వచ్ భారత్ విషయంలో ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపుకు యావత్ భారతమే స్పందిస్తుంది. ఇక మా అభిమానుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. అన్ని ప్రాంతాల అభిమానులు ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. అందరూ తాము చేసిన స్వచ్ భారత్ ప్రోగ్రామ్ ఫోటోలను వాట్సాప్, ఫేసుబుక్ లలో పంపిస్తున్నారు. నిన్న సాయంత్రానికే ఆ ఫొటోలు, వీడియోలు విపరీతంగా  వైరల్    అయ్యాయి. నిజంగా ఇంత గొప్పగా, మనస్ఫూర్తిగా స్పందించిన మీ అందరికి చాలా చాలా థాంక్స్' అన్నారు.

Click here for Event Gallery