అల్లరి నరేష్‌ హీరోగా 'మేడ మీద అబ్బాయి'
APEDB
Ramakrishna

అల్లరి నరేష్‌ హీరోగా 'మేడ మీద అబ్బాయి'

12-03-2017

అల్లరి నరేష్‌ హీరోగా 'మేడ మీద అబ్బాయి'

అల్లరి నరేష్‌ హీరోగా ‘మేడ మీద అబ్బాయి’ అనే కొత్త చిత్రం తెరకెక్కనుంది. జాహ్నవి ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. మలయాళంలో విజయం సాధించిన ‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని ప్రజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మలయాళ నటి నిఖిల విమల్‌ కథానాయికగా పరిచయం అవుతున్నారు. మార్చి 16 నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.