చైతు, సమంత వెడ్డింగ్ కార్డు ఇదే
MarinaSkies
Kizen

చైతు, సమంత వెడ్డింగ్ కార్డు ఇదే

10-08-2017

చైతు, సమంత వెడ్డింగ్ కార్డు ఇదే

టాలీవుడ్‌ ప్రేమజంట అక్కినేని నాగచైతన్య, సమంత త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. అక్టోబరు 6న వీరి వివాహ వేడుకను గోవాలో నిర్వహించనున్నారు. అయితే చైతూ, సమంత శుభలేఖ అంటూ సోషల్‌మీడియాలో ఓ కార్డు చక్కర్లు కొడుతోంది. చైతూ, సామ్‌, వీరి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న ఈ పెళ్లిపత్రికను అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. గోవా వగేటర్‌ బీచ్‌లోని ది డబ్ల్యూ హోటల్‌లో ఈ శుభకార్యం జరగనున్నట్లు పత్రికలో పేర్కొన్నారు. అయితే ఇది నిజమైన పెళ్లిపత్రికా? కాదా? అనే విషయం తెలియాల్సి ఉంది.