బయోపిక్‌లో నటించనున్న పీవీ సింధు
MarinaSkies
Kizen
APEDB

బయోపిక్‌లో నటించనున్న పీవీ సింధు

17-07-2017

బయోపిక్‌లో నటించనున్న పీవీ సింధు

తన బయోపిక్‌లో బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు నటించనుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత, నటుడు సోనుసూద్‌ ధ్రువీకరించాడు. న్యూయార్‌లో జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సూద్‌ ఈ విషయం వెల్లడించారు. ప్రధాన పాత్రను దీపికా పదుకోన్‌ పోషించనున్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తావించగా, నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదన్నారు. అయితే దీపిక కూడా చిత్రంలో భాగస్వామురాలవుతుందని మాత్రం వెల్లడించారు. చిత్రంలో నటించేందుకు తగినవారిని భావించే నటులందర్నీ సంప్రదించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్టు తుది దశలో ఉందని తెలిపాడు. చిత్రంలో తాను ఓ రోల్‌ పోషించనున్నట్టు సోనుసూద్‌ తెలిపాడు.