మార్చి 16న బాహుబలి -2 ట్రైలర్ విడుదల
APEDB
Ramakrishna

మార్చి 16న బాహుబలి -2 ట్రైలర్ విడుదల

11-03-2017

మార్చి 16న బాహుబలి -2 ట్రైలర్ విడుదల

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి. ద కన్‌క్లూజన్‌. తొలి భాగానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని అన్ని థియేటర్లలోనూ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇక సమాజిక మాధ్యమాల్లో అదే రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలు పోషించిన బాహుబలి ద కన్‌క్లూజన్‌ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం కూడా అదే రోజున లభించనుంది.