పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనమ్
Ramakrishna

పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనమ్

11-03-2017

పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనమ్

బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహూజాతో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్‌లో కొంతకాలం వదంతులు వస్తున్నాయి. ఈ విషయం గురించి మీడియా సోనమ్‌ని ప్రశ్నిస్తే అదేంలేదని అంటూనే ఆనంద్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలనూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. తన ప్రేమ గురించి సోనమ్‌ అందరి ముందు చెప్పినా చెప్పకపోయినా ఆమె తల్లి సునితా కపూర్‌ మాత్రం వీరి ప్రేమ వివాహానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. సునీతకి ఆనంద్‌ నచ్చడంతో ఈ ఏడాది చివర్లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటైతే చూడాలని ఉందని సునితీ మీడియా ద్వారా వెల్లడించారు.  ప్రస్తుతం సోనమ్‌ సంజయ్‌దత్‌ బయోపిక్‌లో, ఆక్షయ్‌కి జంటగా ప్యాడ్‌మ్యాన్‌లో, కరీనా వీరే ది వెడ్డింగ్‌లో సినిమాల్లో నటిస్తోంది.