బాలయ్య 101వ చిత్రం ప్రారంభం

బాలయ్య 101వ చిత్రం ప్రారంభం

11-03-2017

బాలయ్య 101వ చిత్రం ప్రారంభం

నందమూరి బాలకృష్ణ నటించనున్న 101 వ మూవీకి తొలి క్లాప్‌ పడింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఫిల్మ్‌ నగర్‌లోని సన్నిధానంలో తులసీవనం టెంపులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిత్ర ప్రారంభ పూజలు నిర్వహించారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ  మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నటించే ఇతర నటీ నటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ చిత్రం హైదరాబాద్‌ తో పాటు లండన్‌, స్పెయిన్‌ లో షూటింగ్‌ జరుపుకోనుంది. మార్చి 12 నుండి 22 వరకు యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించి ఆ తర్వాత ఇంగ్లండ్‌ వెళ్లనున్నారు. ఏప్రిల్‌ 7  నుండి మే 7 వరకు దాదాపు నెల రోజులు ఈ షెడ్యూల్‌ జరగనుంది. పూజా కార్యక్రమానికి బోయపాటి శ్రీను, క్రిష్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలీ, సుదీర్‌ బాబు తదితరులు హాజరయ్యారు. స్క్రిప్టును వెంకటేశ్వరుని పాదాలచెంత ఉంచి స్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం చిత్రం షూటింగ్‌ అధికారికంగా ప్రారంభమైనట్లుయింది. సెప్టెంబర్‌ 29న చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు.