దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. కాజల్‌

దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. కాజల్‌

14-12-2019

దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. కాజల్‌

టాలీవుడ్‌లో దశాబ్ద కాలం పాటు స్టార్‌ హీరోలకు జోడీగా నటించిన ముద్దుగుమ్మ కాజల్‌. ఈ అమ్మడు ఈ మధ్య సరైన హిట్‌ను అందుకోలేకపోతుంది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. తమిళంలో ఒకటి చేస్తుండగా హిందీలో ఒక చిన్ని సినిమా చైస్తోంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు విజయవాడలో ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో పాల్గొంది. ఈ సందర్బంగా కాజల్‌ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. నా పెళ్లి అంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. ఇంకా పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం నేను పలు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాను. కమల్‌హాసన్‌తో మల్టీ లాంగ్వేజ్‌ సినిమా చేస్తుండగా... హిందీలో కూడా ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో కథలు వింటున్నాను అని పేర్కొంది.