రంగ మార్తాండలో.. దొరసాని

రంగ మార్తాండలో.. దొరసాని

14-12-2019

రంగ మార్తాండలో.. దొరసాని

ఈ ఏడాది విడుదలైన దొరసాని చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు శివాత్మికా రాజశేఖర్‌.. డాటారాఫ్‌ జీవితారాజశేఖర్‌. తొలి చిత్రంతోనే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందారామె. తాజాగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే చాన్స్‌ కొట్టేశారు శివాత్మిక. ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రంగ మార్తాండ. నానా పటేకర్‌ నటించిన మారాఠీ చిత్రం నట సామ్రాట్‌కు ఇది తెలుగు రీమేక్‌. ఈ సినిమాలో గాయనిగా నటిస్తున్నారట శివాత్మిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో శివాత్మిక పాల్గొంటున్నారని తెలిసింది. ఇందులో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణల కూతురి పాత్రలో కనిపిస్తారట శివాత్మిక. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.