డబ్ల్యూఈఎఫ్‌ క్రిస్టల్‌ అవార్డుకు దీపిక ఎంపిక

డబ్ల్యూఈఎఫ్‌ క్రిస్టల్‌ అవార్డుకు దీపిక ఎంపిక

14-12-2019

డబ్ల్యూఈఎఫ్‌ క్రిస్టల్‌ అవార్డుకు దీపిక ఎంపిక

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) క్రిస్టల్‌ అవార్డుకు నటి దీపికా పడుకోన్‌, మరో ముగ్గురు ఎంపికయ్యారు. సమాజంలో మార్పులకు ప్రేరణగా నిలిచిన కళాకారులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. చైనాకు చెందిన జిన్‌ జింగ్‌తో పాటు థెస్టర్‌ గేట్స్‌ (షికాగో), లినెట్టె వాల్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)ను ఈ అవార్డు వరించింది. మానసిక ఆరోగ్యంపై ప్రజలను చైతన్యం చేసినందుకు దీపికకు ఈ అవార్డు ఇవ్వనున్నారు.