నటుడు గొల్లపూడి ఇకలేరు

నటుడు గొల్లపూడి ఇకలేరు

12-12-2019

నటుడు గొల్లపూడి ఇకలేరు

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్లయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్‌ చక్రవర్తి సినిమాతో రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.