కంగనా రీమేక్‌ చేస్తారా ?

కంగనా రీమేక్‌ చేస్తారా ?

22-10-2019

కంగనా రీమేక్‌ చేస్తారా ?

అమలాపాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ఆడై. తెలుగులో ఆమె గా విడుదలైంది. ఈ సినిమాలో నగ్నంగా నటించి అమలాపాల్‌ సంచలనం సృష్టించారు. రత్నకుమార్‌ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో విమర్శకుల ప్రసంశలు పొందింది ఈ సినిమా. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్‌ కాబోతోందని సమాచారం. ఒరిజినల్‌ను రూపొందించిన రత్నకుమారే హిందీ రీమేక్‌కు డైరెక్ట్‌ చేయనున్నారట. హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా నటించేవారిలో కంగనా రనౌత్‌ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.