స్వాతంత్య్ర దినోత్సవ కానుక రణరంగం

స్వాతంత్య్ర దినోత్సవ కానుక రణరంగం

17-07-2019

స్వాతంత్య్ర దినోత్సవ కానుక రణరంగం

శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న రణరంగం చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. కాజల్‌, కళ్యాణి, ప్రియదర్శిని కథనాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఆయన మాట్లాడుతూ 1990 నుంచి 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఇందులో శర్వానంద్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు. ఆయన పాత్ర వైవిధంగా, భావోద్వేగపూరితంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి. ప్రసాద్‌, సంగీతం: ప్రశాంత్‌ పిళ్ళై, ఛాయాగ్రహణం: దివాకర్‌ మణి.