జబర్దస్త్ సినిమా కోసం తొలిసారి జత కట్టారు సమంత-నందినిరెడ్డి. ఆ చిత్రం ఇద్దర్నీ ఘోరంగా నిరాశపరిచింది. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మరో రీమేక్‌తో జనం ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. సమంత ప్రస్తుతం 96 రీమేక్‌లో శర్వానంద్ సరసన నటిస్తోంది. బహుశా ఈ సినిమా తరువాత మళ్లీ నందినిరెడ్డి సినిమా ఉంటుందేమో చూడాలి.