కొత్త రికార్డు సృష్టించిన ఖైదీ

కొత్త రికార్డు సృష్టించిన ఖైదీ

11-03-2017

కొత్త రికార్డు సృష్టించిన ఖైదీ

చిరంజీవి చిత్రం ఖైదీ నంబర్‌ 150 సినిమా దక్షిణాది చిత్రాల్లో బిగ్గెస్ట్‌ గ్రాస్‌ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు కెక్కిందని ఆ సినిమా నిర్మాత రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. 50 రోజుల్లో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి రూ.77 కోట్లు కలెక్ట్‌  చేస్తే, ఖైదీ నంబర్‌ 150 ప్రపంచ వ్యాప్తంగా 54 రోజుల్లో రూ.164 కోట్లు వసూలు చేసిందని చెర్రీ ప్రకటించారు. ఒకే ఒక్క భాషలో విడుదలై ఇంత భారీ స్థాయిలో కలెక్షన్స్‌ సాధించిన సౌత్‌ సినిమా ఇదే కావడం విశేషం. తమిళ్‌ చిత్రం కత్తికి ఇది తెలుగు రీమెక్‌. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. తొమ్మిదేళ్ల అనంతరం చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చేసిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.