సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

21-05-2019

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇందులో డార్లింగ్‌ సీరియస్‌గా మిస్టరీ లుక్‌లో కనిపించారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. దీన్ని ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తూ 15న థియేటర్‌లో కలుద్దామని పోస్ట్‌ చేశారు. ఇప్పటికే సాహో చాప్టర్‌-1, సాహో చాప్టర్‌-2 అంటూ ఈ సినిమా మేకింగ్‌ వీడియోలను విడుదల చేశారు. సాహో కు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.