అవార్డుల కన్నా రివార్డులే మిన్న

అవార్డుల కన్నా రివార్డులే మిన్న

21-05-2019

అవార్డుల కన్నా రివార్డులే మిన్న

తన తాజా చిత్రం భారత్‌లో హీరోయిన్‌గా నటించిన కత్రినా కైఫ్‌పై చిత్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రశంసల వర్షం కురిపిస్తుండడం తెలిసిందే. ఈ చిత్రంలో కత్రినా తన కెరీర్‌ బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేసిందని, ఇందుకుగాను ఆమెకు నేషనల్‌ అవార్డ్‌ రావడం ఖాయమని సల్మాన్‌ మీడియా ముందే ప్రకటించారు. ఈ విషయమై కత్రినాను ప్రశ్నిస్తే ఆమె మాత్రం ప్రభుత్వాలు, ప్రయివేట్‌ సంస్థలు ఇచ్చ అవార్డుల కంటే ప్రేక్షకులిచ్చే రివార్డులే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఇటీవల కాలంలో సక్సెస్‌లపరంగా వెనుకబడి ఉన్న కత్రినా అవార్డ్స్‌ కంటే రివార్డ్స్‌ ముఖ్యమని భావించడంలో తప్పు లేదని పరిశీలకులు అంటున్నారు.