మణిరత్నం మూవీలో మామాకోడళ్లు ?

మణిరత్నం మూవీలో మామాకోడళ్లు ?

11-01-2019

మణిరత్నం మూవీలో మామాకోడళ్లు ?

మేవరిక్‌ డైరెక్టర్‌ మణిరత్నం తదుపరి చిత్రంలో మామా కోడళ్లు అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ నటించనున్నారని తెలుస్తోంది. ఐశ్వర్య ఇంతకుమందు మణిరత్నంతో ఇద్దరు, రావణ్‌ చిత్రాల్లో నటించింది. కానీ అమితాబ్‌తో మాత్రం మణిరత్నం ఇప్పటివరకు పని చేయలేదు. పీరియడ్‌ డ్రామాగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ చిత్రంలో ఐశ్వర్య, అమితాబ్‌లతోపాటు ఇంకొందరు స్టార్స్‌ నటించనున్నారు. ఇకపోతే మామాకోడళ్లయిన ఐశ్వర్య, అమితాబ్‌ కూడా పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం సర్కార్‌ రాజ్‌. మణిరత్నం దర్శకత్వంలో అమితాబ్‌, ఐశ్వర్య కలిసి నటించే సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.