సినీ తారలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

సినీ తారలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

11-01-2019

సినీ తారలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ

ప్రధాని నరేంద్రమోదీని బాలీవుడ్‌ యువ తారలు, దర్శకులు ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా అందరూ కలసి ఆయనతో ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, వరుణ్‌ధావన్‌, విక్కీ కౌషల్‌, ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, ఆలియా భట్‌, భూమి పెడ్నేకర్‌తో పాటు దర్శకులు రోహిత్‌ శెట్టి, అశ్వనీ అయ్యర్‌ తివారీ తదితరులు మోదీని కలిసిన వారిలో ఉన్నారు. ఈ మధ్యే బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాతలు కొంతమంది మోదీని కలసి బాలీవుడ్‌ సినిమా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఒక మహిళా కూడా లేకపోవడంతో విమర్శలు వచ్చాయి. అందుకేనేమో ఈసారి ఆయనతో భేటీ అయినవారిలో మహిళలూ ఉన్నారు.