త్వరలోనే భావన పెళ్లి

త్వరలోనే భావన పెళ్లి

15-03-2017

త్వరలోనే భావన పెళ్లి

ఈ మధ్య వార్తల్లో నిలిచిన నటి భావన త్వరలోనే తన నుదిట పెళ్లి బాసికాలు కట్టుకోనున్నారు. కన్నడ నిర్మాత నవీన్‌తో ఈమె వివాహం జరగనుంది. ఆగస్టులో ముహూర్తాలు పెట్టుకున్నారు. వధువరులిద్దరూ కుటుంబాల వారు ఈ వివాహాన్ని ఓ చిన్నపాటి వేడుకగా చేయాలని భావిస్తున్నారు. గత వారంలో భావన, నవీన్‌ల నిశ్చితార్థం  జరిగింది. 2012లో కన్నడలో రూపొందిన రోమియో చిత్రం సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.  ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భావన చేయాల్సిన కొన్ని  సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి ఆగస్టు వరకూ సమయం పడుతుంది. అందుకు ఆ నెలలో వివాహానికి నిశ్చయించాం అని భావన తల్లి శిల్పా అన్నారు.