12న పడి పడి లేచే మనసు టైటిల్ సాంగ్ విడుదల

12న పడి పడి లేచే మనసు టైటిల్ సాంగ్ విడుదల

09-11-2018

12న  పడి పడి లేచే మనసు టైటిల్ సాంగ్ విడుదల

శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా డైరెక్టర్‌ హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం పడి పడి లేచే మనసు. టీజర్‌తో ఇప్పటికే ఆడియన్స్‌ని అట్రాక్ట్‌ చేసిన ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మురళీశర్మ, సునీల్‌లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌కి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్‌, కోల్‌కతా, నేపాల్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకున్న సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి వెల్లడించారు.