శృతిపై కమల్‌ ఆగ్రహం

శృతిపై కమల్‌ ఆగ్రహం

15-03-2017

శృతిపై కమల్‌  ఆగ్రహం

శృతిహాసన్‌ లండన్‌కి చెందిన నటుడు మైఖెల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్నట్టు కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా లండన్‌లో కలుసుకున్న వీరిద్దరూ మూడు నెలలుగా ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసే లండన్‌ నుంచి చెన్నై వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శృతి ప్రేమ విషయంలో తండ్రి కమల్‌హాసన్‌ గుర్రుగా ఉన్నారట. వీరద్దరూ ప్రేమించు కోవడం కమల్‌కు  ఏమాత్రం ఇష్టంలేదట. శృతి బాలీవుడ్‌లో బౌహెన్‌ హోగీ తేరీ అనే ఆల్బమ్‌లో నటిస్తున్నప్పుడు మైఖెల్‌ శృతి కోసం లండన్‌ నుంచి ముంబయి వచ్చాడట. దీనిపై కమల్‌ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రోజుకో కొత్త పుకారు పుట్టుకొస్తుందని, అది తమ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందని కమల్‌ ఫీలవుతున్నాడట.