రైతు పాత్రకు నాని గ్రీన్ సిగ్నల్

రైతు పాత్రకు నాని గ్రీన్ సిగ్నల్

16-10-2018

రైతు పాత్రకు నాని గ్రీన్ సిగ్నల్

తెలుగు చిత్రసీమలో పాత్రలు, కథాంశాల పరంగా వైవిధ్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయకుల్లో నాని ఒకరు. ఇటీవలే నాగార్జునతో కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం దేవదాస్‌ తో చక్కటి విజయాన్ని అందుకున్నారాయన. తాజాగా నాని రైతు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్య కథాంశంతో కిశోరుడు అనే నూతన దర్శకుడు నానికి ఓ కథను వినిపించినట్లు తెలిసింది. దర్శకుడు చెప్పిన కథలోని నవ్యవత ఆకట్టుకోవడంతో నాని ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రైతుగా నాని పాత్ర సరికొత్త పంథాలో సాగనున్నట్లు తెలిసింది. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.