కొండచిలువను మెడలో వేసుకున్న చందమామ

కొండచిలువను మెడలో వేసుకున్న చందమామ

04-10-2018

కొండచిలువను మెడలో వేసుకున్న చందమామ

బెల్లకొండ సాయిశ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా చిత్రీకరణలో భాగంగా కాజల్‌ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియోను కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కొండచిలువను పట్టుకున్నప్పుడు ఆమె తెగ కంగారు పడిపోయారు. కానీ ఆమె పక్కనే పర్యవేక్షకులు ఉండడంతో ధైర్యంగా పట్టుకోగలిగారు. ఆ సమయంలో కాజల్‌ ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి, కాజల్‌ నువ్వు పాము స్పర్శను గ్రహించగలుగుతున్నావా? అని అడిగారు. ఇందుకు కాజల్‌ అవును. నాకు దాని కండరాల కదలిక తెలుస్తోంది. బుసలు కొడుతున్న విషయమూ తెలుస్తోందని అని చెప్పారు. ఇదొక గొప్ప అనుభూతి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌ పెట్టారు. ఈ వీడియోను దర్శకుడు తేజ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.