ఇటలీలో ప్రేమాయణం

ఇటలీలో ప్రేమాయణం

04-10-2018

ఇటలీలో ప్రేమాయణం

సాహో సెట్స్‌పైన ఉండగానే మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశాడు ప్రభాస్‌. రాధాకృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా కోసం సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు ప్రభాస్‌. మీసాలు ట్రిమ్‌ చేసి మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ప్రభాస్‌ ఇటలీలో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌ చూసి అభిమానులు సాహో ప్రభాస్‌ అంటూ కితాబులు అందిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. డార్లింగ్‌ తరవాత ప్రభాస్‌ ప్రేమకథల వైపు చూడలేదు. కొంత విరామం తరువాత చేస్తున్న లవ్‌ స్టోరీ ఇది. కాబట్టి అందుకు తగ్గట్టుగానే సిద్ధమయ్యాడిప్పుడు.