సెన్సేషనల్ సెలబ్రిటీగా గోవా బ్యూటీ!

సెన్సేషనల్ సెలబ్రిటీగా గోవా బ్యూటీ!

04-10-2018

సెన్సేషనల్ సెలబ్రిటీగా గోవా బ్యూటీ!

ఇంటర్నెట్‌లో యువత అత్యధికంగా క్లిక్‌ చేసే పేర్లలో దేవదాస్‌తో తెలుగుకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా పేరు కూడా ఉంది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకోనె, ప్రీతి జింతా, టబు, కృతి, అక్షయ్‌ కుమార్‌, రిషి కపూర్‌, పరిణీతి చోప్రా, గోవిందా తర్వాత ఇంటర్నెట్‌లో అత్యంత సెన్సేషనల్‌ సెలబ్రిటీగా ఇలియానా నిలిచారు. భారతీయ సైబర్‌ స్పేస్‌లో మోస్ట్‌ సెన్షేషనల్‌ సెలబ్రిటీ ఎవరనే విషయంపై ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహించిన సర్వేలోఈ విషయం తేలింది. ఇంతకు ముందు ఆమె పేరు స్థానాన హాస్య నటుడు కపిల్‌ శర్మ పేరు ఉండేది. ఈ ఏడాది ఆయన స్థానానికి ఇలియానా చేరుకున్నారు. అయితే ఈ సెలబ్రిటీల పేరును ఉపయోగించి హ్యకర్లు హానికరమైన సైట్లకు లింకులు వేస్తున్నారట.సెలబ్రిటీల గురించి నిత్యం కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలంతో యువత వీళ్ల పేర్ల మీద ఉన్న లింకులను అనాలోచితంగా క్లిక్‌ చేస్తున్నారని, ఆయా వెబ్‌సైట్లను గురించి తెలుసుకుని క్లిక్‌ చేస్తే వినియోగదారుల డివైజ్‌లకు హాని జరగదని ఆ సర్వేలో తెలింది.