అతిలోక సుందరికి అరుదైన గౌరవం

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

10-09-2018

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కనుంది. ఆమె విగ్రహాన్ని స్విట్జర్లాండ్‌లో నెలకొల్పడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దివంగత శ్రీదేవి నటించి విజయం సాధించిన చాందిని సినిమాను స్విట్జర్లాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో తెరకెక్కించారు. బాలీవుడ్‌ సినిమాలు ఎక్కువ శాతం స్విస్‌లోనే తెరకెక్కాయట. వీటి కారణంగా స్విట్జర్లాండ్‌కు భారత టూరిస్టులు పెరిగారని స్విస్‌ అధికారులు చెబుతున్నారు. యష్‌ చోప్రా సినిమాల్లో అత్యధిక సినిమాలు స్విట్జర్లాండ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లోనే తెరకెక్కాయని 2016లో ఆయన విగ్రహాన్ని స్విస్‌లో ఆవిష్కరించారు. అక్కడి పర్యాటకాన్ని ప్రోత్సహించిన కారణంగా శ్రీదేవి పాత్రను పరిగణనలోకి తీసుకుని ఆమె విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని స్విస్‌ టూరిజం శాఖలో ఒకరు తెలిపారు. 1964లో రాజ్‌కపూర్‌ సంగం సినిమా స్విట్జర్లాండ్‌లో షూటింగ్‌ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది.