సిరివెన్నెలకు జాతీయ ప్రతిభా పురస్కారం

సిరివెన్నెలకు జాతీయ ప్రతిభా పురస్కారం

10-09-2018

సిరివెన్నెలకు జాతీయ ప్రతిభా పురస్కారం

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి కొప్పరపు కవుల కళాపీఠం జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొప్పరపు కవుల కళాపీఠం 16 వార్సికోత్సవం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగింది. కొప్పరపు కవుల కళాపీఠం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో సీతారామశాస్త్రి ఆ పురస్కారం అందుకున్నారు. గురుసహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్‌కు అవధాన పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌, హాస్యనటుడు బ్రహ్మానందం, సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు.