కన్నుల్లో నీ రూపమే ట్రైలర్ లాంఛ్

కన్నుల్లో నీ రూపమే ట్రైలర్ లాంఛ్

15-03-2017

కన్నుల్లో నీ రూపమే ట్రైలర్ లాంఛ్

ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మాతగా నూతన దర్శకుడు బిక్స్ తెరకెక్కించిన సినిమా కన్నుల్లో నీ రూపమే. టాలెంటెడ్ హీరో నందు, కన్నడ భామ తేజస్విని ప్రకాశ్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ తాజాగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత శ్రీ సింధూరపువ్వు కృష్ణారెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీపట్నాయక్, యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్, సంతోషం ఫిల్మ్ మ్యాగజైన్ ఛీఫ్ ఎడిటిర్ సురేశ్ కొండేటి, హీరో నందు, దర్శకుడు బిక్స్, మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కోమండూరి, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తదితరులు ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ లో పాల్గోన్నారు.

అనంతరం అతిధులు మాట్లాడుతూ కొత్త దర్శకుడు బిక్స్ చాలా మెచ్యూర్డ్ గా చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా అనిపిస్తోందని, సినిమాలు మీద మక్కువుతో సాఫ్ట్ వేర్ కెరీర్ ని వదులుకొని దర్శకనిర్మాతలిద్దరు ఈ ప్రాజెక్ట్ ని రూపొందించారని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ప్రేక్షకుల నుంచి సంపూర్ణంగా లభిస్తుందని అన్నారు. అలానే నందు సైతం ఈ సినిమాలో చాలా హ్యాండస్సమ్ గా కనిపిస్తున్నాడని, నందు కెరీర్ లో కన్నుల్లో నీ రూపమే మరో మైలురాయిగా నిలుస్తుందని, హార్ట్ టచ్చింగ్ ఫీల్ గుడ్ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని దర్శకుడు బిక్స్, నిర్మాత భాస్కర్ భాసాని తెలిపారు. ఇది ఇలా ఉంటే హీరో హీరోయిన్లతో పాటు పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృధ్వి కీలక పాత్రలు పోషిస్తున్నఈ సినిమాకు సినిమాటోగ్రఫి- సుభాష్ దొంతి, ఎడిటర్ - మహెందర్ నాథ్.బి.