అభివృద్ధిలో దూసుకుపోతున్న విజయవాడ

అభివృద్ధిలో దూసుకుపోతున్న విజయవాడ

05-09-2018

అభివృద్ధిలో దూసుకుపోతున్న విజయవాడ

గతంతో పోలిస్తే రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరం గణనీయమైన రీతిలో అభివృద్ధి చెందిందని సినీనటుడు సాయికుమార్‌ అన్నారు. ఆయన తన సతీమణితో కలిసి విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి వెళ్లి కనకదుర్గ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో విజయవాడ దూసుకు పోతుందన్నారు. తాను విజయవాడ నగరాన్ని పర్యటించే ప్రతిసారి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నానన్నారు. కృష్ణాతీరంలో జరిగే హారతికి తన నేపథ్యగానాన్ని ఇవ్వడం పూర్వ జన్మ సుకృతమన్నారు.