జగపతి బాబు బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్
Sailaja Reddy Alluddu

జగపతి బాబు బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్

04-09-2018

జగపతి బాబు బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్

కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు, లెజెండ్‌ సినిమాతో క్రూరమైన విలన్‌గా మారారు. లెజెండ్‌, రంగస్థలం, గూఢచారి వంటి పలు సినిమాల్లో విలన్‌ గా కనిపించి మెప్పించారు. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ సినీ పరిశ్రమల నుంచి కూడా జగపతిబాబుకు అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీకి కూడా జగపతి బాబు సిద్దమవుతున్నారు. బాలీవుడ్‌ సీనియర్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న సినిమా తానాజీ. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కొన్ని రోజుల కిందట ఆ పాత్రకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ జరిగింది. తాజాగా ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.